సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!

- September 19, 2025 , by Maagulf
సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!

రియాద్: సౌదీ అరేబియాలోని మార్కెట్లలో విక్రయించే పండ్లు మరియు కూరగాయల ప్యాకేజింగ్, లేబులింగ్ కోసం నిర్దిష్ట నిబంధనలను సౌదీ అరేబియా వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆహార ఉత్పత్తుల నాణ్యత , భద్రతను నిర్ధారించడంలో ఇది కీలకమని భావిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల భద్రతను నిర్ధారించడానికి నిబంధనలకు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ ఉత్పత్తిదారులు, విక్రయదారులను కోరింది. ప్రజారోగ్యం, భద్రతతోపాటు పర్యావరణ పరిరక్షణకు మంత్రిత్వ శాఖ నిబద్ధతలో భాగం అని పేర్కొంది. 

ప్రతి రిటైల్ యూనిట్‌లో వ్యవసాయ ఉత్పత్తి లేబుల్ ఉండేలా చూసుకోవాలన్నారు. అందులో ఉత్పత్తి పేరు, బరువు, ప్యాకేజింగ్ తేదీ, వ్యవసాయ రిజిస్ట్రేషన్ నంబర్, పేరు, లోగో వంటి సరఫరాదారు లేదా ఉత్పత్తిదారుడి వివరాలు ఉండాలని వెల్లడించింది. ఇక ప్యాకేజింగ్ కోసం మన్నికైన, రీ యూజబుల్ ఆహార-గ్రేడ్ పదార్థాలతో తయారు చేసిన వస్తువులను ఉపయోగించాలి. కార్డ్‌ బోర్డ్ ప్యాకేజింగ్ ఒత్తిడిని తట్టుకునేలా ఉండాలని మంత్రిత్వశాఖ నిర్దేశించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com