కువైట్‌లో పూటుగా మద్యం తాగిన భారత వ్యక్తి...
- March 01, 2020
కువైట్: గుర్తు తెలియని ఓ భారత వ్యక్తి పీకలదాకా మద్యం సేవించి ఆగి ఉన్న కారు వెనక వైపు నేలపై పడుకొని ఉండడంతో కువైట్‌లోని హవల్లి పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఆగి ఉన్న కారు వెనక వైపు నేలపై కునుకు తీయడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మొదట ఆ వ్యక్తిని దూరం నుంచి చూసిన స్థానికులు అతనికి కరోనా వైరస్ సోకిందేమోనని దగ్గరికి కూడా వెళ్లలేదు. మరికొందరైతే అతను గుండెపోటుతో చనిపోయి ఉండొచ్చని దూరం నుంచే చూస్తూ ఉండిపోయారు. ఇంతలో అక్కడికి వచ్చిన పారామెడిక్స్, పోలీస్ సిబ్బంది అతని దగ్గరికి వెళ్లి గమనించడంతో అసలు విషయం తెలిసింది. అతను పూటుగా మద్యం తాగి పడిపోయినట్లు గుర్తించారు. దాంతో వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని హవల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..