ఢిల్లీ: భారత్ లోకి కరోనా..హైదరాబాద్, ఢిల్లీలో పాజిటీవ్ కేసులు
- March 02, 2020
కరోనా మహమ్మారి తెలంగాణలోకి ఎంటరైంది. ఇన్నాళ్లు ఏదీ జరగకూడదని భావించారో ఆ పెను ముప్పు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తికి కోవిడ్-19 వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్యవైద్య ఆరోగ్య శాఖ నిర్ధారించింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఐదుగురికి కోవిడ్-19 పరీక్షలు జరపగా నలుగురికి నెగిటివ్‌గా తేలగా.. ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపింది. అటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా కోవిడ్-19 పాజిటీవ్ కేసు నమోదయ్యింది. ఇటలీ నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. దీంతో భారత్ లో ఇప్పటివరకు కోవిడ్-19 పాజిటీవ్ కేసుల సంఖ్య ఐదుకు పెరిగింది. గతంలో కేరళలో ముగ్గురికి కరోనా వైరస్ సోకగా..చికిత్స తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది. ఆ తర్వత దేశంలో కరోనా వైరస్ కేసులు ఏమి లేకపోవని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో లేటెస్ట్ గా రెండు కేసులు నమోదవటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ కు కూడా కరోనా వ్యాప్తి చెందటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







