దుబాయ్ లో ఆగిన మరో గల్ఫన్న గుండె
- March 02, 2020
తెలంగాణ లోని బొమ్మన గ్రామం, కథలాపూర్ మండలం, జగిత్యాల జిల్లా కు చెందిన పాలెపు రాకేష్ అనే కార్మికుడు పొట్ట చేత పట్టుకొని దుబాయ్ వచ్చి బతుకీడుద్దామన్న సమయంలో గత వారం క్రితం ఆరోగ్య పరిస్థితి బాగా లేనందున హాస్పిటల్లో అడ్మిట్ అయి చికిత్స పోందుతు గత నెల 27 వ తారీకున మరణించడం జరిగింది. ఇట్టి విషయాన్ని తన తోటి కార్మికులు మరియు భందువులు మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండెల్లి నర్సింహా కి తెలపడంతో వేంటనే వెళ్లి అన్ని పనులు దగ్గరుండి పూర్తి చేయించి నిన్న రాత్రి మృతదేహాన్ని ఇండియా పంపించడం జరిగింది. మరియు హైదరాబాద్ ఎయిర్పోర్టు నుండి వారి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడ కల్పించడం జరిగింది. బాధిత కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అలాగే గల్ఫ్ కార్మికుల చిరకాల వాంఛ అయిన TNRI పాలసీని వెంటనే అమలు చేయాలని మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి నుండి వేడుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండెల్లి నర్సింహా , ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్, దొనకంటి శ్రీనివాస్, పవన్ కుమార్, కనకట్ల రవీందర్,షేక్ వల్లి, మునిందర్, అశోక్ రెడ్డి, కట్ట రాజు, రాయిల్ల మల్లేశం, శరత్ గౌడ్,జవ్వాజి శంకర్, జవ్వాజి జలందర్,జవాజి శైలేష్,జవ్వాజి చంద్రశేఖర్, బోండ్ల బాలు ,ఏల్లాల గంగారెడ్డి, పాలేపూ శ్రీనివాస్,పాలేపూ వినీష్, పాలేపూ రమేష్, వేల్మల్ సత్యనారాయణ, రాజు పక్కల, గంధం మహేష్, రఘు, ప్రవీణ్ చేర్యాల, నరేందర్ గౌడ్, సాన లక్ష్మణ్, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్, పేనుకుల అశోక్, చిరుత నరేష్, గోవర్ధన్ యాదవ్, మనెళ్లి ప్రసాద్, కాసారపు భుమేష్, యువరాజు, జలపతి, అజయ్, హరిశ్, సాయి మరియు సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







