రెండేళ్ళ వీసా బ్యాన్ ఒమన్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం
- January 22, 2016
రెండేళ్ళ వీసా బ్యాన్ నిబంధన ఒమన్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారులు వెల్లడించారు. ఆయిల్ ధరల పతనంతో ఒమన్ ఆర్థిక వ్యవస్థలో మందగమనం కన్పిస్తోందనీ, ఈ పరిస్థితుల్లో వీసా బ్యాన్ మంచిది కాదనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికీ, పోలీసుల దృష్టికీ తీసుకెళ్ళినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిథి ఒకరు చెప్పారు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా వలసదారులకు తిరిగి పని పొందే అవకాశాన్ని ఇవ్వకుండా రాయల్ ఒమన్ పోలీసులు స్పష్టంగా చెప్పడంతో, వలసదారులు నిరుత్సాహంతో ఉన్నారనీ, కొత్త ఉద్యోగాల్లోంచి వారు తొలగించబడ్డారని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. పలు కంపెనీలు కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాయి. అయితే ఎన్‌ఓసీ సర్టిఫికెట్ల చుట్టూ 'రాకెట్' నడుస్తోందనీ, స్కిల్ లేని వర్కర్స్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ని కంపెనీలతో కలిసి మిస్ యూజ్ చేస్తున్నాయని షురా సభ్యుడు వివరించారు. అస్తమానూ ఉద్యోగాలు మారేవారిని నియంత్రించడానికి ఈ నిబంధన తెచ్చినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీలను ఈ నిర్ణయం ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకూ ఇబ్బందికరమని కంపెనీ వర్గాలు వివరించాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









