మహిళలకు అపూర్వ సత్కారం

- January 22, 2016 , by Maagulf
మహిళలకు అపూర్వ సత్కారం

 ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా ఆడపిల్లల కోసం చేపట్టిన 'బేటి బచావో-బేటి పడావో' పథకం ప్రథమ వార్షికోత్సవ వేడుకలను దేశరాజధాని దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా, శిశు సంరక్షణ, ఆడపిల్లల చదువు కోసం కృషి చేస్తున్న 100 మంది మహిళలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఎచీవర్స్‌ అవార్డులను అందజేశారు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ, ఫేస్‌బుక్‌ సంయుక్తంగా ఈ 100 మంది మహిళలను అవార్డుకు ఎంపిక చేసింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com