పాన్ ఇండియా వైడ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న'అల వైకుంఠపురంలో' ఆడియో మ్యూజిక్ ఆల్బమ్
- March 07, 2020
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఆల్ ఇండస్ట్రీ హిట్ రికార్డ్ బ్రేకర్ అలవైకంఠపురంలో ఆడియో కి వచ్చిన క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ప్రఖ్యాత ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా ఆలవైకుంఠపురం ఆడియో విడుదలైంది. ఈ మ్యూజిక్ ఆల్బమ్ లో ఉన్న అన్ని పాటలకి ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ రావడమే కాకుండా తాజాగా ఈ పాటలు పాన్ ఇండియా వైడ్ ఉన్న ప్రఖ్యాత మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్ అన్నిట్లో టాప్ ప్లెస్ ట్రెండ్ అవుతుండటం విశేషం. ఈ సందర్భంగా ఆదిత్య గ్రూప్ అధినేత శ్రీ ఆదిత్య గుప్తా గారు మాట్లాడుతూ ముందుగా ఇంతటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ మా మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల చేసే అవకాశం ఇచ్చిన హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ వారికి అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక ఈ ఆల్బమ్ లో ఉన్న పాటలు బాలీవుడ్ పాటలను వెనక్కి నెట్టి మరీ జియోసావన్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ వంటి ఆల్బమ్స్ లో టాప్ 1, 2 ,6 స్థానాల్లో ట్రెండ్ అవుతున్నాయి. వీటితో పాటు వింక్, గానా వంటి మ్యూజిక్ ఆప్స్ లో సైతం ఇదే హవా కొనసాగిస్తున్నాయని అన్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







