'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రం నుండి పాట విడుదల
- March 07, 2020
తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం `బాహుబలి`. తెలుగు సినిమా ప్రేక్షకులు గర్వపడే ఈ గొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని. అంత భారీ బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన ఈ నిర్మాతలు అందిస్తోన్న మరో కంటెంట్ బేస్డ్ మూవీ `ఉమామహేశ్వర ఉగ్రరూపస్య`.ఆర్కా మీడియా వర్క్స్, మహాయాణ మోషన్ పిక్చర్స్ బ్యానర్స్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విజయ ప్రవీణ పరుచూరి నిర్మాతలుగా `కేరాఫ్ కంచపాలెం` ఫేమ్ వెంకటేశ్ మహ దర్శకత్వంలో ఓ సినిమాను రూపొందిస్తున్నారు.
ఈ సందర్భంగా జాతీయ అవార్డు గ్రహీతలు బిజ్‌బల్ సంగీతం అందించిన ఈ సినిమాలో తొలి పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విశ్వ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను విజయ్ యేసుదాస్ ఆలపించారు. ఈ పాటను ప్రముఖ యాంకర్ సుమ విడుదల చేశారు.
‘‘నింగి చుట్టే మేఘం
ఎరుగద ఈ లోకం గుట్టు
మునిలా మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో జోడి కట్టు
తొలిగా తారావాసాల ఊసుల్ని వీడి
చూసింది ఓసారి సగటుల కనికట్టు ...’’
అంటూ పాట సాగుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. మలయాళ హీరో ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించిన హిట్ చిత్రం `మహేశింతే ప్రతీకారమ్` చిత్రానికి ఇది రీమేక్. సత్యదేవ్ హీరోగా నటిస్తున్నారు. ఏప్రిల్ 17న సినిమా విడుదల కానుంది.
నటీనటులు:
సత్యదేవ్, నరేశ్, సుహాస్, జబర్‌దస్త్ రాంప్రసాద్, టీఎన్ఆర్, రవీంద్ర విజయ్, కె.రాఘవన్ తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: వెంకటేశ్ మహా
నిర్మాతలు: విజయ్ ప్రవీణ పరుచూరి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వసంత్ జుర్రు
లైన్ ప్రొడ్యూసర్: ప్రజ్ఞయ్ కొనిగరి
ప్రొడక్షన్ కంట్రోలర్: రాము.ఆర్.కె
సినిమాటోగ్రఫీ: అప్పు ప్రభాకర్
సంగీతం: బిజిబల్
ఎడిటర్: రవితేజ గిరిజాల
కథ: శ‌్యామ్ పుష్కరన్
కాస్ట్యూమ్స్: అమృత బొమ్మి
సౌండ్ డిజైనర్: నాగార్జున తలపల్లి
ప్రొడక్షన్ డిజైనర్: సుశాంత్ సావంత్
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







