నేడు నేతాజీ సుభాష్‌చంద్రబోస్ జయంతి చరిత్ర మరువలేని స్వాతంత్ర్య సేనాని
- January 22, 2016
నాకు రక్తాన్ని ఇవ్వండి..నేను మీకు స్వాతంత్య్రాన్ని సాధించి ఇస్తానని చెప్పిన భరత మాత ముద్దు బిడ్డ సుభాష్‌చంద్రబోస్. ఆంగ్లే యుణ్ణి ఈ దేశం నుంచి తరిమేయడానికి వీరోచిత పోరాటాలు నడిపించిన దళపతి సుభాష్‌చంద్రబోస్ తర తరాలకు తరగని స్ఫూర్తి. భారత స్వాతంత్య్రం కోసం పూర్తిగా అహింసాయుతంగా సాగిన భారత స్వాతంత్య్రోద్యమాన్ని విప్ల వమార్గంలో మళ్లించి, ప్రజా మద్దతు పొందిన విప్లవ వీరుల్లో నేతాజీ అగ్రగ ణ్యుడు. వ్యవస్థా గతమైన కార్యాచరణ ద్వారా పోరాటం చేసి సామ్రాజ్యవాద ఆంగ్లేయుల గుండెల్లో గుబులు పుట్టించిన నేతాజీ జీవిత చరిత్ర యువతకు ఎంతో స్ఫూర్తి గా నిలుస్తోంది. భారత జాతీయోద్యమం ప్రోదిచేసిన విలువలు గురించి పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకోవడం సదా మన విధి. రాయబహద్దూర్ జానకీనాధ్‌బోస్ మరియు ప్రభావతీదేవి దంపతులకు 13 మంది సంతానంలో ఆరవ బిడ్డగా ఒడిషా రాష్ట్రం కటక్ నగరంలో 1887 జనవరి 23 న నేతాజీ జన్మించారు. తల్లి ప్రభావతీదేవి శ్రీరామకృష్ణ పరమహంస భక్తురాలు కావడంతో సుభాష్‌చంద్రబోస్‌పై ఆథ్యాత్మిక ప్రభావం విద్యార్థి దశలో పడింది. తర్వాత స్వామి వివేకానంద రచించిన గ్రంథాలు చదివిన తర్వాత దైవభక్తితో పాటు దేశభక్తి తోడైంది.1911లో సుభాష్‌చంద్రబోస్ మెట్రిక్యులేషన్‌ను అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత చెంది, 1918 లో బి.ఎ ఫిలాసఫీని కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి సాధించాడు. తండ్రి కోరిక మేరకు 1919 లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 4వ స్థానం పొందాడు. సివిల్ సర్వీసెస్ లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ జలియన్‌వాలాబాగ్ దుర్ఘటన అతని మనసును పూర్తిగా కలిచివేయడంతో 1921 లో సివిల్ సర్వీసెస్ నుంచి వైదొలగాడు నేతాజీ. మాతృదేశ దాస్య విముక్తి శంఖారావం విన్న తర్వాత దేశ రాజకీయాల్లో ప్రవేశించాలని నేతాజీ నిర్ణయించుకున్నారు.నాటి ఆంగ్లేయుల నిరంకుశాధికారంపై వ్యతిరేకత సామాజిక సమానత్వ సాధన అనే రెండు లక్ష్యాలపైనే ప్రముఖంగా నేతాజీ దృష్టి సారించారు. తొలుత 1921లో బ్రిటిష్ యువరాజు వేల్స్ పర్యటన సందర్భంగా నిరసన ప్రదర్శన నిర్వహించినందుకు నేతాజీ జైలు శిక్ష అనుభవించారు. కలకత్తా కార్పొరేషన్‌కు 1924 ఏప్రిల్ నెలలో జరిగిన ఎన్నికల్లో సుభాష్‌చంద్రబోస్ పోటీ చేసి మేయర్‌గా ఎన్నికయ్యారు. బెంగాల్‌లో ఆయన కొనసాగిస్తున్న స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా పెక్కు నిరసనలు, ర్యాలీలు, ఉపన్యాసాలు, ధర్నాలు చేస్తుండగా ఆంగ్లేయ పాలకులు నేతాజీని నిర్బం ధించి ఆపాపూర్ జైలుకు పంపారు. తర్వాత బర్మాలోని మండలే జైలుకు తీసుకెళ్లారు. మళ్లీ 1930 జనవరి 23 న స్వతంత్ర ప్రదర్శన నిర్వహించినందుకు మరోసారి అరెస్ట్ చేశారు. సుమారు 20 ఏళ్లలో 11 సార్లు జైలుకు వెళ్లారు. ఒక దశలో ఆయనను గృహ నిర్బంధంలో ఉంచినప్పటికీ తప్పించుకొని బెర్లిన్ చేరుకొని అక్కడ నుంచి రేడియో ద్వారా భారతీయులకు సందేశం ఇచ్చారు. బోస్ భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా రెండు సార్లు వరుసగా ఎన్నికైనారు. కానీ మహాత్మాగాంధీతో ఏర్పడిన కొన్ని అనివార్య విభేదాల వలన తన అధ్యక్ష పదవివి రాజీనామా చేశారు. తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజ కీయ పార్టీని నేతాజీ స్థాపించారు. ఆయన ప్రారంభించిన ఉద్యమానికి భార తదేశం నలు మూలల నుంచి అద్వితీయమైన సహకారం లభించింది. "జైహింద్'' "డిల్లీ చ లో'' నినాదాలతో భారతజాతిని చైతన్యపరిచి రవి అస్త మించని బ్రిటి ష్ సామ్రాజ్యంలో పోరాటానికై ఆగ్నేయాసియాలో నివసించే భారత ప్రజా నీకం సహకారంతో 'ఆజాద్ హింద్ ఫౌజ్' నేతాజీ స్థాపించారు. అప్పటికే జపాన్ గుప్పిట్లో ఉన్న అండమాన్, నికోబార్ దీవులను ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రభుత్వానికి అప్పగించే విధంగా నేతాజీ జపాన్ ప్రధానమంత్రి నుంచి అక్కడి భారతీయులు విముక్తి పొందే విధంగా ప్రకటన చేయించారు.
తొలి సారిగా అండమాన్ స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆజాద్ హింద్ ఫౌజ్ తరఫున రాణి ఝాన్సీరెజిమెంట్‌కు కెప్టెన్ లక్ష్మి నాయ కత్వం వహించారు. సింగపూర్‌లో నున్న నేతాజీ అండమాన్ చేరుకున్న తర్వాత స్థానిక ప్రజానీకం ఆయనకు బ్రహ్మరథం పట్టింది. నాడు అండమాన్ జైలులో ఉన్న భారతీయ ఖైదీలందరిని ఆజాద్ హింద్ ఫౌజ్ సర్కార్ విడుదల చేసింది. వారిలో మెజార్టీ ఖైదీలందరూ సాయుధ పోరాటానికి నేతాజీ వెంట నడిచారు. ఆజాద్ హింద్ ఫౌజ్ సర్కార్ స్వతంత్ర ఫ్రభుత్వ ప్రధాన కేంద్రం రంగూన్ అయితే, రెండవ కేంద్రం సింగపూర్ అయింది. ఆయన సింగపూర్‌తో పాటు రంగూన్, రష్యా, జపానుల్లో తరచూ పర్యటించవలసి వచ్చేది. నేతాజీకి విశ్రాంతి దొరకని రోజులవి. కేవలం భారత దేశానికే స్వాతంత్య్రం కాక అనేక ఆసియా దేశాల విముక్తి కోసం నేతాజీ విదేశాంగ విధానం అవలం బించారు.
ఈ నేపథ్యంలో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ ఓటమి కావడంతో రష్యా సహకారం కోసం ఆయన తైవాన్ నుంచి ఒక విమానంలో 1945 ఆగస్ట్ 18 న బయలుదేరగా మార్గమధ్యలో ఆ విమా నం కూలిపో యినట్లుగా జపాన్ సర్కార్ ప్రకటించింది. ఇంతకీ ఆ విమాన ప్రమాదంలో నేతాజీ మరణించాడని కొందరు మరణించలేదని కొందరు నమ్ముతున్నారు. ఏది ఏమైనా నేతాజీ అదృశ్యం మిస్టరీగానే మిగిలిపోయి నప్పటికీ ఆ దళపతి చూపించిన తెగువ, పోరాట పటిమకు మనం జోహార్లర్పించాలి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









