రానా 'విరాటపర్వం'కు పనిచేస్తున్న హాలీవుడ్, బాలీవుడ్ టెక్నీషియన్స్
- March 09, 2020
రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'విరాటపర్వం'. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. చివరి షెడ్యూల్ మాత్రమే మిగిలుంది. త్వరలోనే ఆ షెడ్యూల్‌ను మొదలుపెట్టనున్నారు.
ఈ చిత్రానికి కొంతమంది హాలీవుడ్, బాలీవుడ్ టెక్నీషియన్లు, ఆర్టిస్టులు పనిచేస్తుండటం విశేషం. ఈ సినిమాలోని ప్రధాన ఆకర్షణల్లో యాక్షన్ సన్నివేశాలు ఒకటి. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'ఉరీ: ద సర్జికల్ స్ట్రైక్'కు పనిచేసిన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ స్టీఫెన్ రిచెర్ ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లకు రూపకల్పన చేశారు.
యాక్షన్ సహా అన్ని రకాల సన్నివేశాలకు రానా, ఇతర తారాగణం పూర్తిస్థాయిలో శ్రమిస్తుండగా, ఉన్నతస్థాయి నాణ్యతా ప్రమాణాలతో నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
'నీదీ నాదీ ఒకే కథ' ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో ప్రియమణి ఒక కీలక పాత్రలో కనిపిస్తారు. డి. సురేష్‌బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ ఫేమస్ నటి నందితా దాస్, ఈశ్వరీరావు, జరీనా వహాబ్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. హాలీవుడ్‌కు చెందిన డానీ సాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
ఈ వేసవిలో 'విరాటపర్వం'ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







