దుబాయ్:రమదాన్ మాసంలో 900 వేల మందికి ఇఫ్తార్..ఓ ఛారిటీ సంస్థ ఏర్పాట్లు
- March 10, 2020
దుబాయ్:పవిత్ర రమదాన్ మాసంలో భక్తులకు ఉచితంగా భోజన ఏర్పాట్లు చేసింది బీట్ అల్ ఖైర్ సొసైటీ అనే చారిటీ సంస్థ. దాదాపు 9 లక్షల మంది భక్తులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ప్రతి రోజు ఇఫ్తార్ టెంట్లలో దాదాపు 30 వేల మందికి ఇప్తార్ మీల్స్ అందించేలా ఏర్పాట్లు చేసినట్లు బీట్ అల్ ఖైర్ డైరెక్టర్ జనరల్ అబ్దీన్ తహర్ అల్ అవదీ తెలిపారు. ప్రతీ మీల్ లో రైస్, మీట్, చికెన్, డేట్స్, ఫ్రూట్స్, వాటర్ తో పాటు పాలు కూడా అందించనున్నట్లు వివరించారు. గత ఏడాది ఇఫ్తార్ మీల్స్ కోసం dh6.7 మిలియన్ల తో 7,05,000 మందికి ఉచిత ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాదాపు 45 ఇఫ్తార్ టెంట్లలో డిస్ట్రిబ్యూట్ చేసినట్లు వెల్లడించారు. ఈద్ అల్ ఫితర్ ముగిసే వరకు రమదాన్ క్యాంపెన్ కొనసాగుతుందని పేద కుటుంబాల్లో సంతోషం నింపటమే తమ లక్ష్యనని ఆయన అన్నారు. అలాగే దాదాపు 52 వేల కుటుంబాలు భక్తులకు సేవ చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం