మస్కట్ ఫెస్టివల్లో ప్రధాన ఆకర్షణ 'ఒమన్ టూరిజం'
- January 23, 2016
మస్కట్ ఫెస్టివల్లో ఒమన్ టూరిజం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేసింది. మస్కట్ ఫెస్టివల్‌కి విచ్చేసిన దేశ విదేశాలకు చెందిన ఔత్సాహికులు, ఒమన్ టూరిజంకి సంబంధించి అనేక విషయాల్ని ఆసక్తిగా తెలుసుకున్నారు. దేశంలో సందర్శనీయ ప్రాంతాల గురించి తెలుసుకోవడంతోపాటుగా, ఒమన్ సంప్రదాయాల్ని అర్థం చేసుకుని, వాటి పట్ల గౌరవం పెంచుకోవడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. మస్కట్ ఫెస్టివల్లో ఒమన్ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన స్టార్ చాలా రద్దీగా ఉంటోంది ఔత్సాహికులతో. రిచ్ కల్చర్, ట్రెడిషన్ గురించి ఔత్సాహికులు తెలుసుకుని, సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ట్రెడిషనల్ ఒమన్ కాఫీ ఔత్సాహికుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. కాఫీ మేకింగ్ గురించి వారు శ్రద్ధగా నిర్వాహకుల్ని అడిగి తెలుసుకుంటున్నారు. హంగేరీ నుంచి వచ్చిన ఓ విజిటర్, ఒమన్ గురించి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందనీ, ఒమన్ అందించే జెన్యూన్ హాస్పిటాలటీని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







