దోహా:ఎక్కువ ధరలకు మాస్క్స్, గ్లౌవ్స్ అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
- March 17, 2020
దోహా:భారీ మొత్తంలో మాస్క్స్, గ్లౌవ్స్ ను సేకరించి వాటిని మళ్లీ ఎక్కువ ధరలకు అమ్ముతున్న ఆసియన్ వ్యక్తి ఖతార్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి పెద్ద మొత్తంలో మెడికల్ సప్లైస్ లభించినట్లు అధికారులు వెల్లడించారు. 800 మెడికల్ గ్లౌవ్స్, 7900 మెడికల్ మాస్క్స్, 1502 యాంటీబయోటిక్ క్లాత్స్, థర్మమీటర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే QR 200,000 క్యాష్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఫేస్ మాస్క్స్, గ్లౌవ్స్ విపరీతమైన డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ డిమాండ్ ఆసరాగా చేసుకున్న నిందితుడు పలు ఫార్మసీ కంపెనీల నుంచి పెద్ద మొత్తం గ్లౌవ్స్, మాస్క్స్ కొనుగోలు చేసి వాటిని అక్రమంగా ఎక్కువ ధరకు రీసేల్ చేస్తున్నాడు. విషయం తెల్సుకున్న క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అతన్ని కక్కుర్తికి చెక్ పెట్టింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







