కరోనా:సవాలు విసిరిన మోదీ...
- March 16, 2020
ఢిల్లీ:భారత దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. సోమవారం వరకు భారత దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 114కు చేరుకుంది. ఇద్దరు కరోనా కారణంగా మరణించారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ప్రధాని మోదీ కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు దేశంలోని ప్రతి ఒక్కరూ తమకు తోచిన సలహాలు, సూచనలు, పరిష్కార మార్గాలు తెలియజేయాలని కోరారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అయితే చాలా మంది ఈ వైరస్‌ను నియంత్రించేందుకు సలహాలు, సూచనలు ఇస్తున్నారని, కానీ వారు https://innovate.mygov.in/covid19/ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ సలహాలు, సూచనలు, పరిష్కార మార్గాలను తెలియజేయవచ్చని అన్నారు. కాగా ఈ సైట్‌లో ఔత్సాహికులు, స్టార్టప్ కంపెనీలు లేదా పరిశ్రమలు ఎవరైనా సరే.. తమ సలహాలు, సూచనలు, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కావల్సిన పరిష్కార మార్గాలతోపాటు అందుకు అవసరమైన సమాచారాన్ని పీడీఎఫ్ డాక్యుమెంట్ రూపంలో అప్‌లోడ్ చేయవచ్చు. లేదా యూట్యూబ్ వీడియోలో వివరణ ఇచ్చి ఆ వీడియో లింక్‌ను ఆ సైట్‌లో పోస్ట్ చేయవచ్చు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







