దుబాయ్:దుబాయ్ పోలీస్ చీఫ్ కు లెఫ్టినెంట్ జనరల్ గా పదోన్నతి

- March 18, 2020 , by Maagulf
దుబాయ్:దుబాయ్ పోలీస్ చీఫ్ కు లెఫ్టినెంట్ జనరల్ గా పదోన్నతి

దుబాయ్:దుబాయ్ పోలీసు కమాండర్-ఇన్-చీఫ్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రిని లెఫ్టినెంట్ జనరల్ గా ప్రమోట్ చేశారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దుబాయ్ లో శాంతి భద్రతలను కాపాడటంలో సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించినందుకు గుర్తింపుగా ఆయనకు పదోన్నతి కల్పించినట్లు తెలిపారు. అలాగే ప్రపంచ సురక్షిత నగరాల్లో ఒకటిగా దుబాయ్ గుర్తింపు పొందటంలో అబ్దుల్లా ఖలీఫా కృషి చేశారని ప్రశంసించారు. తనపై నమ్మకం ఉంచి తనకు పదోన్నతి కల్పించినందుకు దుబాయ్ రూలర్ సేక్ మొహమ్మద్ కి లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మారీ కృతజ్ఞతలు తెలిపారు. దేశ సేవలో, ప్రజలకు రక్షణ కల్పిస్తూ వారి సుఖసంతోషాల్లో భాగస్వామ్యులు అవుతున్న పోలీసుల చేస్తున్న కృషి గర్వకారణమని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com