మంత్రి కేటీఆర్ నేటి నుంచి 28వ తేదీ వరకు గ్రేటర్లో రోడ్‌షో
- January 24, 2016
రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నేటి నుంచి 28వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్‌లో రోడ్‌షోలలో పాల్గొననున్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల గెలుపునకు మంత్రి ప్రచారాన్ని తలపెట్టారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు రోడ్‌షో ప్రారంభం కానుంది. గచ్చిబౌలి, కొండాపూర్, హఫీజ్‌పేట్, మియాపూర్, చందానగర్, హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, జగద్గిరిగుట్టలో రోడ్‌షో కొనసాగనుంది. రేపు అల్లాపూర్, బాలాజీనగర్, కూకట్పల్లి, బాలానగర్, జీడిమెట్ల, మారారంలో రోడ్‌షో కార్యక్రమం. గ్రేటర్ పోలింగ్ ఫిబ్రవరి 2వ తేదీన. కౌంటింగ్ 5వ తేదీన. కాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఈ ఉదయం 10 గంటలకు మేనిఫెస్టోను విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







