నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్‌లో 495 ఉద్యోగాలు
- March 24, 2020భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు చెందిన సైంటిస్టు ఉద్యోగాల భర్తీకి న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్(NIC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 495 ఖాళీలు ఉన్నాయి. ఫిబ్రవరి 26, 2020న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 26 దరఖాస్తుకు చివరితేది. ఇంకా రెండురోజులు మాత్రమే ఉంది.
ఆసక్తిగల అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్దులు సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంఎస్, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్, ఓబీసీ అభ్యర్దులు రూ.800 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు, మహిళా అభ్యర్దులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. అభ్యర్దులను రాతపరీక్ష, ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 35 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు 33 ఏళ్లు. దివ్యాంగులకు 40 ఏళ్లు వయసు ఉండాలి.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







