కరోనావైరస్: విదేశీ విద్యార్థులందరినీ స్వదేశానికి పంపించనున్న యూఏఈ
- March 24, 2020
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ప్రయాణ ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. అదే కోవలో యూఏఈ సైతం 48 గంటల్లో విదేశాలకు చెందిన ఎమిరాతీ విద్యార్థులందరినీ స్వదేశానికి తీసుకురానున్నట్టు విద్యా మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ అథారిటీ ఫర్ ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తెలిపారు. అలాగే యూఏఈ లో విద్యనభ్యసిస్తున్న ఇతర దేశ విద్యార్థులను కూడా తమ స్వదేశాలకు పంపించేస్తున్నారు. సంబంధిత దేశాల్లోని రాయబార కార్యాలయాల సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు అబుధాబి మీడియా కార్యాలయం ట్విట్టర్‌లో తెలిపింది.
విదేశాలలో ఉన్న ఎమిరాతీలు తమ పాఠశాలలు మూతబడినా లేదా అధికారులు తమ దేశాలకు వెళ్లాలని సూచించినా, వెంటనే యూఏఈ కు తిరిగి రావాలని మంత్రిత్వ శాఖ గతంలో సూచించాయి. తిరిగి వచ్చే విద్యార్థులు యూఏఈ నుండి పరిమిత కాలానికి/ ప్రస్తుత సెమిస్టర్/విద్యా సంవత్సరం ముగిసే వరకు ఆన్‌లైన్‌లో దూరవిద్య చేయవలసి ఉంటుందని అధికారులు తెలిపారు. తిరిగి వచ్చిన ఎమిరాతీ విద్యార్థులు “ఎట్టి పరిస్థితుల్లోనూ” తిరిగి ప్రయాణించరాదని అధికారులు తెలిపారు. యుఎస్, యుకె మరియు ఐరోపాలో క్యాంపస్‌లలో విద్యనభ్యసిస్తున్న యూఏఈ విద్యార్థులు ఇప్పటికే మిడ్-సెమిస్టర్ కోర్సులను విడిచిపెట్టి యూఏఈ రావటం జరిగిందని అధికారులు తెలిపారు.
The United Arab Emirates has decided to bring back all its overseas students, including those with scholarships or self paid, within 48 hours, in coordination with scholarships’ entities, attachés and embassies in the concerned countries
— مكتب أبوظبي الإعلامي (@admediaoffice) March 23, 2020
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







