బహ్రెయిన్: ఆన్ లైన్ లో వైద్య సేవలు..కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం

బహ్రెయిన్: ఆన్ లైన్ లో వైద్య సేవలు..కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాయల్ బహ్రెయిన్ హస్పిటల్ ఆన్ లైన్ లోనూ వైద్య సేవలు అందిస్తోంది. వైరస్ వ్యాప్తి నియంత్రణకు సామాజిక దూరం పాటించటంలో భాగంగా ఆర్బీహెచ్ ఈ నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి గురువారం వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్లాట్స్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. www.royalbahrainhospital.com/telehealth ద్వారా స్లాట్స్ కోసం పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ సైట్ ఓపెన్ చేయగానే ముందుగా మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఏ విభాగం డాక్టర్ ను ఏ సమయంలో సంప్రదించాలని అనుకుంటున్నారో నమోదు చేయాలి. ఆ తర్వాత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఈ-మెయిల్ కు టైం స్లాట్ నిర్ధారిస్తూ సందేశం వస్తుంది. దాంతో పాటు ఓ లింక్ కూడా వస్తుంది. స్లాట్ బుక్ చేసుకున్న వ్యక్తి 15 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. టెలి హెల్త్ ద్వారా హెల్త్ చెకప్ చేసిన సదరు డాక్టర్ మీరు రిజిస్టర్ చేసుకున్న ఈ మెయిల్ కు ప్రిస్కిప్షన్ పంపిస్తారు. స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లైట్స్, డెస్క్ టాప్ నుంచి టెలి హెల్త్ సేవలను పొందవచ్చు. 

 

Back to Top