దుబాయ్ : ఎక్స్ పో 2020 నిర్వహణపై సందిగ్థత...వచ్చే సోమవారం స్టీరింగ్ కమిటీ భేటీ

దుబాయ్ : ఎక్స్ పో 2020 నిర్వహణపై సందిగ్థత...వచ్చే సోమవారం స్టీరింగ్ కమిటీ భేటీ

అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దుబాయ్ ఎక్స్ పో 2020 నిర్వహణపై సందిగ్థత కొనసాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రదర్శనను నిర్వహించాలా? వద్దా? అనే అంశంపై స్టీరింగ్ కమిటీ ఏ నిర్ణయానికి రాలేకపోతోంది. ప్రతిష్టాత్మకంగా భావించిన ఎక్స్ పో2020కి అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసిన విషయం తెలిసింది. అయితే..కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని స్టీరింగ్ కమిటీ తెలిపింది. ఎక్స్ పో 2020పై నిర్ణయం తీసుకునేందుకు వచ్చే సోమవారం (మార్చి 30) భేటీ కావాలని నిర్ణయించింది. ప్రపంచ దేశాల పరస్పర సహకారం, ఆవిష్కరణలను ఈ అంతర్జాతీయ ప్రదర్శనలో ప్రదర్శించేందుకు కృతనిశ్చయంతో కృషిచేశామని స్టీరింగ్ కమిటీ వెల్లడించింది. ప్రస్తుత విపత్కర సమయంలో ఎక్స్ పోపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా భాగస్వామ్య దేశాల మద్దతు అవసరమని అభిప్రాయపడింది. 

 

Back to Top