ఇటలీ:గడిచిన 24గంటల్లో 743 మంది మృతి
- March 25, 2020
రోమ్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. ఇటలీలో విజృంభిస్తోంది. కరోనా పుట్టిల్లు చైనాలో కన్నా ఇటలీలొనే ఎక్కువమంది ఈ వైరస్ కు బలయ్యారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే రెండ్రోజులుగా ఇటలీలో కరోనా మరణాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. దీంతో నెమ్మదిగా పరిస్థితి అదుపులోకి వస్తోందని అంతా భావించారు. కానీ ఈ అంచనాలన్నీ ఇప్పుడు తారుమారయ్యాయి. ఎందుకంటే ఇటలీలో మృతుల సంఖ్య మళ్ళీ పెరిగింది. గడిచిన 24గంటల్లో ఇక్కడ 743 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. సోమవారం ఈ సంఖ్య 608గా ఉంది. అలానే కరోనా పాజిటివ్ కేసులు కూడా ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ఇటలీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 69,176. కరోనా బాధితులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో చైనా తర్వాత ఇటలీనే ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







