'మనం సైతం'కు రూ.5 లక్షలు అందజేసిన దర్శకుడు వి.వి. వినాయక్
- March 25, 2020
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో దినసరి వేతనంతో బతికే పేద కళాకారులు, టెక్నీషియన్స్ ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివారికి సాయం చేసేందుకు డైరెక్టర్ వి.వి. వినాయక్ తన వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. నటుడు కాదంబరి కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో నడుస్తోన్న 'మనం సైతం' ఫౌండేషన్‌కు రూ. 5 లక్షలు అందజేశారు. నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్న పేద సినీ కళాకారులు, సాంకేతిక విభాగాల్లో పనిచేసే కార్మికులు మనం సైతంను సంప్రదించి, వాటిని పొందవచ్చని ఆయన తెలిపారు.
ఈ విషయాన్ని ఒక వీడియో సందేశం ద్వారా వినాయక్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, "ఈరోజు అందర్నీ వణికిస్తోన్న కరోనా వైరస్‌ను మన ఇళ్లల్లో మనం ఉండి వణికించాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలోని పేద కళాకారులు, టెక్నీషియన్లు, డాన్సర్లు, ఫైటర్లు.. ఎవరైనా కానివ్వండి.. నెల రోజుల పాటు షూటింగ్స్ లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. వాళ్లకు నిత్యావసర వస్తువులను అందజేసే నిమిత్తం నా వంతుగా రూ. 5 లక్షల చెక్కును మనం సైతం కాదంబరి కిరణ్‌కుమార్‌కు అందజేస్తున్నా. నిజంగా ఎవరికి అవసరమో వారు కాదంబరి కిరణ్ గారిని సంప్రదించి, నిత్యావసర వస్తువులను తీసుకోవాల్సిందిగా కోరుతున్నా" అని చెప్పారు. నిరంతరం పేద సినీ కళాకారుల సంక్షేమం కోసం పరితపిస్తోన్న 'మనం సైతం' ఫౌండేషన్‌ను ఈ సందర్భంగా వినాయక్ ప్రశంసించారు. అందుకే ఆ ఫౌండేషన్ ద్వారా తన వంతుగా ఈ చిన్న సాయాన్ని చేస్తున్నానని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







