‘రౌద్రం రుధిరం రణం’గా టైటిల్ ఖరారు మోషన్ పోస్టర్ విడుదల
- March 25, 2020
బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కథానాయకులుగా నటిస్తోన్న భారీ చిత్రానికి ‘రౌద్రం రుధిరం రణం’గా టైటిల్‌ను ఖరారు చేశారు. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ టైటిల్‌ను, మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
తెలంగాణ గొండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తుండగా..కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ జోడీగా ఒలివియా మోరిస్, చరణ్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తున్నారు. ఇంకా హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ఉగాది సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు వస్తోన్న రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మోషన్ పోస్టర్‌లో అగ్ని స్వభావంతో ఉన్నట్లు రామ్‌చరణ్ పాత్రను, జల స్వభావంతో ఉన్నట్లు ఎన్టీఆర్ పాత్రను ఎస్.ఎస్.రాజమౌళి డిజైన్ చేశారని అర్థమవుతుంది.
అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతి సందర్భంగా జనవరి 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...