'సర్దార్ గబ్బర్‌సింగ్' లో 5 కోట్లతో హైదరాబాద్‌లో భారీ సెట్ ..
- January 24, 2016
పవన్‌కల్యాణ్ ఓ విలేజ్‌పై ఫోకస్ పెట్టాడు. అన్నికోణాల్లో దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడట. ఇళ్లు, మార్కెట్, షాపులు, రైల్వేట్రాక్, చిన్న చిన్న మేళాలు ఇలా అన్నీ అందులో రియల్‌గా కనిపిస్తాయట. దాదాపు 5 కోట్లతో నిర్మిస్తున్నాడు. ఇందంతా రియల్ లైఫ్ కాదండోయ్.. రీల్ లైఫ్‌లో! 'సర్దార్ గబ్బర్‌సింగ్' పని మొదలుపెట్టి దాదాపు రెండున్నర ఏళ్లుపైనే సాగింది. కానీ ఈ ప్రాజెక్ట్ డిలే అవుతూ వస్తోంది. ఎందుకిలా జరుగుతోంది? రకరకాల ప్రశ్నల నేపథ్యంలో అసలు విషయం రివీల్ అయ్యింది.ఈ ఫిల్మ్‌ని పవన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. దీనికి సంబంధించి ప్రతీ చిన్న విషయాన్ని చాలా కేర్ తీసుకుంటున్నాడట. రీసెంట్‌గా 5 కోట్లతో హైదరాబాద్‌లో భారీ సెట్ వేశారు యూనిట్ సభ్యులు.ఇందులో రత్నపూర్ అనే విలేజ్ నిర్మించేశారు. విలేజ్ ఎలా వుండాలి? ట్రెండ్‌కు తగ్గట్టుగా వుండేలా అన్నిదగ్గరుండి చూసుకుంటున్నాడని టాక్. ప్రతి పనిని కీన్‌గా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈ సెట్‌కు సంబంధించి షాపులు ఎలా వుండాలి? ఎంట్రన్స్ ఎలా ఐతే బాగుంటుంది? దీనివెనక బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం కనపడాలి? వంటివి చూస్తున్నాడని యూనిట్ అంటోంది. ఆర్ట్ డైరక్టర్ బ్రహ్మ కడలి చేత ఫస్ట్ మినియేచర్ సెట్ వేయించాడు పవన్. తాను సాటిస్‌ఫై అయ్యేదాకా మార్పులు చేర్పులు చేస్తూనే వున్నాడు. ఈ సెట్ చాలా నేచురల్‌గా వుండేలా కొలిక్కి తెచ్చాడు. ఈ మంత్ ఎండింగ్ నాటికి ఈ విలేజ్ సెట్‌లో షూటింగ్ పూర్తి అవుతుందని, మూవీకి ఇదే హైలైట్ అవుతుందని సమాచారం.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







