వీసా, పాస్‌పోర్ట్ ఏజెన్సీ కోసం 'టెండర్' పిలిచిన ఇండియన్ ఎంబసీ
- January 24, 2016
వీసా, పాస్‌పోర్ట్ సేవలు అందించేందుకు యూఏఈలోని ఇండియన్ ఎంబసీ టెండర్లను ఆహ్వానించింది. ప్రస్తుతం బిఎస్ఎల్ ఇంటర్నేషనల్ సంస్థ పాస్‌పోర్ట్, వీసా సౌకర్యాల్ని అందిస్తోంది. ఐవిఎస్ గ్లోబల్ సంస్థ అటెస్టేషన్స్ మరియు కాన్సులర్ సర్వీసుల్ని అందజేస్తోంది. వీటి టెండర్ ముగుస్తుండడంతో కొత్త టెండర్లను ఆహ్వానించింది ఇండియన్ ఎంబసీ. టూరిజం రంగంలో పదేళ్ళపాటు అనుభవం, వీసా - పాస్‌పోర్ట్ విభాగంలో కనీసం మూడేళ్ళ అనుభవం, తగిన అర్హతలున్న సంస్థలు టెండర్ ప్రక్రియలో పాల్గొనవచ్చని ఇండియన్ ఎంబసీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే బిఎల్ఎస్ సంస్థ తిరిగి ఆ కాంట్రాక్ట్‌ని దక్కించుకోవచ్చని అనుకుంటున్నారు. కొత్త కాంట్రాక్ట్ నాలుగేళ్ళ పరిమితితో ఉంటుంది. వీసా, పాస్‌పోర్ట్ సేవల్ని మరింత సరళతరం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎంబసీ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







