'మోసగాళ్లు'లో భారీ ఐటీ ఆఫీస్ సెట్ షూటింగ్ నిలిపివేసిన మంచు విష్ణు
- March 27, 2020_1585299179.jpg)
మంచు విష్ణు ప్రస్తుతం 'మోసగాళ్లు' అనే హాలీవుడ్-ఇండియన్ సినిమా చేస్తున్న విషయం విదితమే. ఈ చిత్రం కోసం ఆయన కూకట్‌పల్లిలో సుమారు రూ. 3.5 కోట్ల వ్యయంతో ఒక భారీ ఐటీ ఆఫీస్ సెట్‌ను నిర్మించారు. ఇప్పుడక్కడ ఎడారి వాతావరణం కనిపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంతో రూపొందుతున్న 'మోసగాళ్లు' సినిమా షూటింగ్ 2019 మొదట్లో ఆరంభమైంది. లాస్ ఏంజెల్స్, హైదరాబాద్ ప్రాంతాల మధ్య వేగంగా చిత్రీకరణ జరుపుకుంటూ వస్తున్న షూటింగ్ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధ చర్యల్లో భాగంగా లాక్డౌన్ ప్రకటించడంతో పూర్తిగా ఆగిపోయింది.
విష్ణుతో పాటు కాజల్ అగర్వాల్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి తదితరులు పాల్గొనగా ప్రధాన సన్నివేశాలు, క్లైమాక్స్ యాక్షన్ సీన్లు దాదాపు పూర్తయ్యాయి. అయితే, చిత్రానికి అతి కీలకమైన ఐటీ ఆఫీస్ సీన్లు.. లాక్డౌన్ కారణంగా నిరవధికంగా ఆగిపోయాయి.
'మోసగాళ్లు' చిత్రీకరణ ఆగిపోయిన విషయం చిత్ర బృందం ధ్రువీకరిస్తూ, ప్రతి యూనిట్ మెంబర్ క్షేమం దృష్ట్యా చిత్రీకరణ నిలిపివేశామనీ, ప్రస్తుతం దేశం ఎదుర్కొటున్న విపత్కర పరిస్థితి మెరుగై, సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక చిత్రీకరణ కొనసాగిస్తామని తెలిపింది.
ప్రపంచవ్యప్తంగా కరోనా వైరస్ వల్ల ప్రభావితులైన వారు త్వరగా కోలుకోవాలని మంచు విష్ణు ఆకాంక్షిస్తున్నారు. ప్రజలందరూ ప్రభుత్వ సలహాలు, సూచనలను కచ్చితంగా పాటించాలని ఆయన కోరారు. అందరూ సామాజిక దూరం పాటిస్తూ, స్వీయ క్వారంటైన్‌ను అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇటీవల 'మోసగాళ్లు' చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్లకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. ఆ పోస్టర్లలో అర్జున్‌గా విష్ణు, అను పాత్రలో కాజల్ అగర్వాల్, ఏసీపీ కుమార్‌గా సునీల్ శెట్టి కనిపించి ఆకట్టుకున్నారు.
హాలీవుడ్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్న 'మోసగాళ్లు' సినిమాలో మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది వేసవికే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..