పీఎం కేర్స్ ఫండ్ కు అక్షయ్ కుమార్ రూ.25 కోట్ల భారీ విరాళం
- March 28, 2020అక్షయ్ కుమార్ భారీ విరాళం ప్రకటించారు. దేశంలో 21 రోజుల లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో విరివిగా విరాళాలు ఇవ్వాలన్న ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తికి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు. ప్రధాని ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్ కు రూ.25 కోట్ల భారీ విరాళం ప్రకటించారు.
ఇప్పుడు ప్రతి విషయం దేశ ప్రజల ప్రాణాలకు సంబంధించినదేనని అక్షయ్ కుమార్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. మనవాళ్ల కోసం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని, నేను పొదుపు చేసిన డబ్బు నుంచి పాతిక కోట్ల రూపాయలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నానని తెలిపారు. "మనం ప్రాణాలను కాపాడుదాం. ప్రాణాలుంటేనే జీవించగలం" అంటూట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్‌కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత