అక్రమంగా నిల్వ చేసిన 1 మిలియన్‌ మెడికల్‌ మాస్క్‌ల స్వాధీనం

- March 30, 2020 , by Maagulf
అక్రమంగా నిల్వ చేసిన 1 మిలియన్‌ మెడికల్‌ మాస్క్‌ల స్వాధీనం

సౌదీ మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇన్వెస్టిమెంట్‌, 1,168,000 మెడికల్‌ మాస్క్‌లను సీజ్‌ చేయడం జరిగింది. వీటిని అక్రమంగా నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. నిందితులు, హెయిల్‌ సిటీ నుంచి వాటిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా, అధికారులు నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో మాస్క్‌ల వినియోగం పెరిగింది. దీన్ని క్యాష్‌ చేసుకునేందుకు అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారు. అథారిటీస్‌ ఎప్పటికప్పుడు ఇలాంటివారిపై తగిన చర్యలు తీసుకుంటున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com