కరోనా ఎఫెక్ట్:వాహనదారులకు గుడ్ న్యూస్
- March 31, 2020
భారత దేశంలో ఫిబ్రవరి 1తో... చాలా మంది డ్రైవింగ్ లైసెన్సుల గడువు ముగిసింది. అదే సమయంలో... కరోనా వైరస్ భారత్ పై పడటంతో... కేంద్రం మార్చి 31లోపు పొడిగింపు చేయించుకోవాలని ఆదేశించింది. అయితే... ఇప్పుడు లాక్‌డౌన్ అమల్లో ఉండటంతోపాటూ... చాలా ప్రభుత్వ ఆఫీసులు మూతపడ్డాయి. కావాల్సిన పత్రాలు అందుబాటులో లేవు. దాంతో... కేంద్ర ప్రభుత్వం ఈ గడువును జూన్ 30 వరకూ పెంచుతూ ఆదేశాలిచ్చింది. అందువల్ల డ్రైవింగ్ లైసెన్స్ ముగిసినవారు... కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకునేవారు... జూన్ 30 లోపు అప్లై చేసుకోవచ్చు. ఇది నిజంగా వాహనదారులకు ఎంతో ఊరట కలిగించే అంశమే.
ఫిబ్రవరి 1తో ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు ఇతర మోటార్ వెహికల్ డాక్యుమెంట్ల గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా... అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నడుచుకోవాలని కేంద్రం తెలిపింది. అందువల్ల వాహనాల ఫిట్‌నెస్, పర్మిట్లు, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్‌తో పాటు మోటారు వాహన నిబంధనల ప్రకారం జారీ చేసిన అన్ని పత్రాలకూ గడువు జూన్ 30 వరకూ ఉంటుంది. కాబట్టి ఇవాళ హడావుడిగా ఇళ్లలోంచీ బయటకు వెళ్లాల్సిన పని లేదు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన