ఏప్రిల్‌ 15 వరకు ఇండియన్‌ పాస్‌పోర్ట్‌, వీసా అప్లికేషన్‌ సెంటర్స్‌ మూసివేత

- April 02, 2020 , by Maagulf
ఏప్రిల్‌ 15 వరకు ఇండియన్‌ పాస్‌పోర్ట్‌, వీసా అప్లికేషన్‌ సెంటర్స్‌ మూసివేత

జెడ్డా: ఇండియన్‌ కాన్సులేట్‌ జనరల్‌, జెడ్డా పరిధిలోని అన్ని పాస్‌పోర్ట్‌ మరియు వీసా అప్లికేషన్‌ సెంటర్స్‌ ఏప్రిల్‌ 15 వరకు మూసివేయబడి వుంటాయని కాన్సులేట్‌ ఓ ప్రెస్‌ స్టేట్‌మెంట్‌ ద్వారా వెల్లడించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ట్రావెల్‌ నిబంధనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర సందర్భాల్లో, తమ దరఖాస్తులను కాన్సులేట్‌కి ఇ-మెయిల్‌ ద్వారా తెలియజేయవచ్చు. ఎమర్జన్సీ సిట్యుయేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాల్ని, సంబంధిత డాక్యుమెంట్స్‌ని కూడా పంపించాల్సి వుంటుంది. కాన్సులేట్‌ అధికారులు ఈ విషయంలో తగిన సహాయ సహకారాలు అందిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com