ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు
- January 25, 2016
ఆంధ్రప్రదేశ్ లో 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ నరసింహన్ జాతీయ జెండాను గవర్నర్ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని నరసింహన్ స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జె.వి. రాముడుతోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో సైనిక కవాతు, ప్రభుత్వ శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే హైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆవిష్కరంచారు.ఏపీ శాసనమండలి ప్రాంగణంలో ఛైర్మన్ చక్రపాణి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ శాసనమండలి సిబ్బంది హాజరయ్యారు. వివిధ జిల్లాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకల వివరాలు... అనంతపురం జిల్లా: అనంతపురం : నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లాలోని 163 మంది ప్రతిభావంతులకు కోన శశిధర్ మెమెంటోలు అందజేశారు. అలాగే గణతంత్ర వేడుకల్లో భాగంగా ఓపెన్ ఎయిర్ జైలు నుంచి 146 మంది ఖైదీలను విడుదల చేయనున్నారు. చిత్తూరు జిల్లా : చిత్తూరు : చిత్తూరు నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ పాల్గొన్నారు. గుంటూరు జిల్లా: గుంటూరు: నగరంలోని పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎస్పీ త్రిపాఠి, రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







