అమెరికాలో వేగంగా పెరుగుతోన్న మరణాల సంఖ్య..

అమెరికాలో వేగంగా పెరుగుతోన్న మరణాల సంఖ్య..

అమెరికాలో కరోనావైరస్ వేగంగా విజృంభిస్తోంది. మరణాల సంఖ్య కూడా వేల సంఖ్యలో పెరుగుతూ పోతోంది. శుక్రవారం జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించిన గణాంకాల ప్రకారం, గురువారం మరియు శుక్రవారం మధ్య యునైటెడ్ స్టేట్స్ COVID-19 ద్వారా దాదాపు 1,500 మరణాలను నమోదు చేసింది..దాంతో మహమ్మారి ద్వారా మరణించిన వారి సంఖ్య 7,406 కు చేరుకుంది. 7,406 మరణాలతో ఇటలీ, స్పెయిన్ తరువాత మూడో స్థానంలో నిలిచింది. అలాగే కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం చివరి నాటికి మొత్తం 277,467 కేసులు నమోదు అయ్యాయి. అయితే వీరిలో కేవలం 12,283 మంది కోలుకున్నారు.

Back to Top