మనామాలో కార్ల ధ్వంసం

- January 26, 2016 , by Maagulf
మనామాలో కార్ల ధ్వంసం

సుమారు 50కి పైగా కార్లు మనామా గేట్‌ ప్రాంతంలో ధ్వంసం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆగంతకులు ఈ దాడులకు పాల్పడినట్లు తెలియవస్తున్నది. ఎక్కువగా వలసదారుల కార్లపైనే ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడులకు సంబంధించి 20కి పైగా ఫిర్యాదులు పోలీస్‌ స్టేషన్లలో నమోదయ్యాయి. తెల్లవారు ఝామున 3 గంల సమయంలో ఈ ఘటన జరిగింది. ఉదయం 3.30 నిమిషాల సమయంలో తాను లేచి చూడగా, కార్లు ధ్వంసమయి ఉన్నాయని రణిజిత్‌ పోడి అనే వ్యక్తి చెప్పారు. ఓ వ్యక్తి ఈ దాడులకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తిని యువకుడిగా గుర్తించినట్లు చెప్పారు ప్రత్యక్ష సాక్షులు. అయితే ఆ యువకుడు ఎవరన్నది తెలియరాలేదు. అద్దాలను పదునైన ఆయుధంతో పగలగొట్టారనీ, అలాగే వైపర్‌ బ్లేడ్స్‌ని తొలగించేందుకు ప్రయత్నించారని వాహనదారులు రిపోర్ట్‌ చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com