యూఏఈ: ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు ప్రకటన..

- April 05, 2020 , by Maagulf
యూఏఈ: ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు ప్రకటన..

యూఏఈ: ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నవారికి ఊరట..కరోనా పెరిగిపోతున్న ఈ సమయంలో ఎవరయినా తమ స్వదేశాలకు వెళ్లాలని అనుకుంటే ఆయా కంపెనీల యజమానులు ఉద్యోగస్తులకు Annual Leave లో నుంచి కానీ, మిగిలిపోయి ఉన్న సెలవుల నుంచి కానీ, 'జీతం లేని సెలవు' లను వారికి కేటాయించి వారివారి స్వదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని తెలిపిన అధికారులు. ఈ క్లిష్ట సమయంలో తమ కుటుంబంతో ఉండాలనుకునే వారికి ఈ చర్య దోహదపడుతుందని తెలిపిన అధికారులు.

ఇదిలా ఉండగా, పలు దేశాలు విమాన రాకపోకలను నిలిపివేశాయి. ఈ తరుణంలో యూఏఈ అధికారిక ఎయిర్లైన్స్ 'ఎమిరేట్స్' తమ స్వదేశాలకు వెళ్లాలనుకున్నవారికి విమానసౌకర్యం కల్పిస్తోంది. ఇండియా లో లాక్ డౌన్ నడుస్తున్నందున, విమాన రాకపోకలు నిలిచిపోయాయి. కాబట్టి భారత్ ప్రభుత్వం ప్రకటనను అనుసరించి ఇండియాకు కూడా త్వరలో విమాన సర్వీస్ లను ప్రారంభించనుంది ఎమిరేట్స్ ఎయిర్లైన్స్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com