సింగపూర్: 11 మంది భారతీయులకు కరోనా

- April 08, 2020 , by Maagulf
సింగపూర్: 11 మంది భారతీయులకు కరోనా

సింగపూర్‌లో 11 మంది భారతీయులకు తాజాగా కరోనా వైరస్‌ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 9మంది పురుషులు ఇద్దరు మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. వీరంతా 28-44 ఏండ్ల మధ్య వయసువారేనని తెలిపారు. సింగపూర్‌లో మంగళవారం మరో 106 మందికి కరోనా సోకడంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1481కి చేరిందని ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేసులు పెరుగుతుండటంతో దేశంలో ఇళ్లల్లో కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ జనం గుమికూడరాదని సింగపూర్‌ ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com