ఎమిరేట్స్ ఐడీ కార్డ్‌లోనే ఇన్స్యూరెన్స్, ఏటీఎం, డ్రైవింగ్ లైసెన్స్
- January 27, 2016
ఎమిరేట్స్ ఐడెంటిటీ అథారిటీ (ఇఐడిఎ), ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు తగిన ఏర్పాట్లను చేస్తోంది. ఎమిరేట్స్ ఐడీ కార్డ్‌తోనే డ్రైవింగ్ లైసెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్, ఏటీఎం కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్‌లను అనుసంధానం చేసే దిశగా అన్ని ఏర్పాట్లూ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఐడీ కార్డ్‌లోని స్మార్ట్ చిప్ ద్వారా అన్ని సేవల్నీ ఒకే కార్డు ద్వారా అందించడం మంచి మార్గంగా అధికారులు చెబుతున్నారు. బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు 'ఐడీ' కార్డ్ ద్వారా సేవలు అందించేందుకు సుముఖత వ్యక్తం చేశాయనీ, సమాచారాన్ని కూడా ఇస్తున్నాయని అధికారులు వెల్లడించారు. కొన్ని కంపెనీలు ఇప్పటికే తమ కార్డుల్ని ఐడీ కార్డ్‌తో రీప్లేస్ చేశాయని చెప్పారు. నేషనల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ దామన్ ఐడీ కార్డ్ ద్వారా ఇన్స్యూరెన్స్ వ్యవహారాల్ని కొనసాగించేందుకు ట్రయల్స్ కూడా ప్రారంభించింది. ఎయిరేట్స్ ఐడీ కార్డ్ ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా ఉంటుందనీ, ఇది లైఫ్‌టైమ్ కార్డ్ అని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







