కరోనా: ఎమిరేట్స్ టిక్కెట్లు 2 సంవత్సరాలు చెల్లుతాయి
- April 13, 2020
దుబాయ్: కరోనా సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రయాణీకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది దుబాయ్ అధికారిక విమానయాన సంస్థ ఎమిరేట్స్. ప్రయాణీకులు తాము బుక్ చేసుకున్న టికెట్లపై 24 నెలల పొడిగింపును ప్రకటించింది. అంటే, మీరు బుక్ చేసుకున్న టికెట్ ను వాడికోవట్లేదే అని దిగులు పడక్కర్లేదు..దాని కాన్సిల్ చేసుకోకుండా 24 నెలల లోపు వాడుకోవచ్చు అది కూడా అదనపు చార్జీలు కట్టకుండా! కాబట్టి మీరు మళ్లీ ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీ ఫ్లైట్‌ను రీ షెడ్యూల్ చేయడానికి మీరు ఎమిరేట్స్ కు కాల్ చేసి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు అని ప్రకటించారు.
ఈ సదుపాయం మే 31 లోపు చేసిన బుకింగ్‌ల పై మాత్రమే. జూన్ 1 నుండి బుకింగ్‌ల పై సమయానుకూలంగా బుకింగ్ ఛార్జీల షరతులు ఉంటాయని ఎమిరేట్స్ తెలిపింది. ముఖ్యంగా, 24 నెలల వ్యవధిలో ప్రయాణీకులు రీ బుక్ చేసినప్పుడు ఫీజులో ఎటువంటి మార్పు ఉండదని ఎయిర్లైన్స్ క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష