ఏప్రిల్ 24న ప్రారంభం కానున్న రమదాన్!
- April 14, 2020
దుబాయ్: అరబ్ యూనియన్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ స్పేస్ సైన్సెస్ మెంబర్ ఇబ్రహీం అల్ జర్వాన్ మాట్లాడుతూ, ఏప్రిల్ 24వ తేదీ నుంచి రమదాన్ ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు చెప్పారు. గురువారం, ఏప్రిల్ 23 రాత్రి 6.26 నిమిషాలకు రమదాన్ క్రిసెంట్‌మూన్ జన్మిస్తుందనీ, వెస్టర్న్ హారిజాన్పై సన్‌సెట్ అనంతరం 20 నిమిషాల తర్వాత ఇది కన్పిస్తుందని చెప్పారాయన. ఇది స్పష్టంగానే కంటికి కన్పిస్తుంది గనుక, ఏప్రిల్ 24 నుంచి పవిత్ర రమదాన్ మాసం ప్రారంభమవుతుందని వివరించారు. ఈ ఏడాది ఉపవాస సమయం 15 గంటల కంటే తక్కువగా వుండొచ్చు. అతి తక్కువగా 14 గంటల 25 నిమిషాల పాటు వుండే అవకాశం వుంది. అత్యధికంగా 14 గంటల 57 నిమిషాలు వుండొచ్చు. షవ్వాల్ నెలకి సంబంధించి చంద్రుడు మే 22 శుక్రవారం 21.39 (పిఎం) సన్‌సెట్ తర్వాత వుంటుందనీ, దాంతో శనివారం ఫాస్టింగ్ డే(ఉపవాస దినం) వుంటుందనీ, అది రమదాన్ 30వ రోజు అవుతుందని చెప్పారు. మే 24 ఆదివారం షవ్వాల్ తొలి రోజు అనగా ఈద్ తొలి రోజు అవుతుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







