కరోనాపై పోరుకు గూగుల్ సీఈఓ రూ.5కోట్ల విరాళం

- April 14, 2020 , by Maagulf
కరోనాపై పోరుకు గూగుల్ సీఈఓ రూ.5కోట్ల విరాళం

కరోనా మహమ్మారిపై ప్రపంచ వ్యాప్తంగా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో పలువురు విరాళాలు అందిస్తున్నారు. ఈ మహమ్మారి పోరుపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తనవంతు సాయం ప్రకటించారు. కరోనా కారణంగా ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకుంటున్న 'గివ్ ఇండియా' స్వచ్ఛంధ సంస్థకు సుందర్ పిచాయ్ రూ. 5 కోట్ల విరాళం ప్రకటించారు.

అయితే ఇప్పటికే గూగుల్ సంస్థ ఈ స్వచ్ఛంధ సంస్థకు 5 కోట్లు మొత్తాన్ని విరాళంగా ప్రకటించగా.. సుందర్ పిచాయ్ తాజాగా వ్యక్తిగత స్థాయిలో ఈ విరాళం ప్రకటించారు. దీంతో 'గివ్ ఇండియా' పిచాయ్‌కు ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపింది. అసంఘటిత రంగంలోకి వారి కోసం ఈ నిధులను వినియోగిస్తామని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com