వినియోగదారుల్ని అప్రమత్తం చేసిన బిగ్‌ టికెట్‌ అబుధాబి

- April 15, 2020 , by Maagulf
వినియోగదారుల్ని అప్రమత్తం చేసిన బిగ్‌ టికెట్‌ అబుధాబి

అబుధాబి:బిగ్‌ టికెట్‌ అబుధాబి డ్రా నిర్వాహకులు, తమ వినియోగదారుల్ని అప్రమత్తం చేశారు. మోసగాళ్ళు కొందరు, ఆన్‌లైన్‌ వేదికగా కొన్ని మెసేజ్‌లు పోస్ట్‌ చేస్తున్నారనీ, బిగ్‌ టికెట్‌ పేరుతో అమాయకుల్ని మోసగిస్తున్నారనీ, ఈ విషయంలో అప్రమత్తంగా వుండాలని ఓ హెచ్చరిక ప్రకటన జారీ చేసింది బిగ్‌ టికెట్‌ అబుధాబి. ఎట్టి పరిస్థితుల్లోనూ మోసగాళ్ళకు వ్యక్తిగత సమాచారం అందించవద్దని ఈ ప్రకటనలో పేర్కొన్నారు నిర్వాహకులు. బిగ్‌ టికెట్‌ వెబ్‌సైట్‌లో మాత్రమే పూర్తి వివరాలుంటాయనీ, లక్కీ విన్నర్‌ అయితే, విన్నర్‌ పేరు అలాగే టిక్కెట్‌ నంబర్‌ని అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని, ఎలాంటి వ్యక్తిగత వివరాల్నీ తాము కోరబోమని నిర్వాహకులు స్పష్టం చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com