త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి జైలుపాలయ్యాడు: పాకిస్థాన్
- January 27, 2016
భారత దేశ వ్యాప్తంగా మంగళవారం గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. స్కూల్‌లు, కాలేజీలు, కార్యాలయాలపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అయితే పాకిస్థాన్‌లో ఓ వ్యక్తి కూడా తన ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. భారత క్రికెటర్ మీదున్న తన అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు. కానీ.. ఆ అభిమానమే.. ఇప్పుడతన్ని కటకటాల వెనక్కి నెట్టింది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ ప్రావిన్స్‌లోని ఒకారా జిల్లాకు చెందిన ఉమర్ ద్రాజ్ అనే వ్యక్తికి భారత క్రికెటర్ విరాట్‌కోహ్లి అంటే అభిమానం. నిన్న భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ-20 మ్యాచ్‌లో కోహ్లి అద్భుతంగా ఆడిన విషయం తెలిసిందే. దీంతో ఆనందంతో ఉప్పొంగిపోయిన ఉమర్.. తన ఇంటిపై భారతీయ జెండాను ఎగురవేశాడు. అయితే ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. దీంతో పోలీసులు అతడి ఇంటిపై దాడి చేసి.. జెండాను, కోహ్లి ఫొటోలను స్వాధీనం చేసుకున్నారు. ఉమర్‌ను అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించారు. అయితే దీనిపై ఉమర్ మాట్లాడుతూ.. తాను కేవలం కోహ్లి అంటే అభిమానంతోనే అలా చేశానని.. తానేమీ గూఢచారిని కాదని, దేశద్రోహిని అంతకన్నా కాదని చెప్పాడు. తాను ఎలాంటి నేరం చేయలేదని వదిలిపెట్టాలని కోరుతున్నాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







