రెండు రాష్ట్రాలకు విభజన వల్ల లాభం: కేటీఆర్
- January 27, 2016
విభజన వల్ల రెండు రాష్ట్రాలకు లాభం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్ ఫినిక్స్ హబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.... సమైక్యాంధ్ర కొనసాగి ఉంటే మరో 25 ఏళ్లయినా అభివృద్ధి పనులు జరిగేవి కావన్నారు. ఐటీ ఎగుమతుల్లో దేశ సగటు 7 ఉంటే... రాష్ట్ర సగటు 16 శాతంగా ఉందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఐటీ రంగానికి సంబంధించి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో హైదరాబాద్‌ను బాగు చేసి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి ఉండేదికాదన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతానికి మేలు జరిగిందంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధిలో సీమాంధ్ర ప్రాంతం శరవేగంతో దూసుకెళ్తోందని ఆయన చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







