చిరు 150వ సినిమాకు కొన్ని చిక్కులు
- January 27, 2016
చిరంజీవి, వివి వినాయక్ దర్శకత్వంలో కత్తి సినిమా రీమేక్ చేయాలని రామ్ చరణ్ భావించగా, ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ఇటీవలే ప్రారంభించినట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమాను ఫిబ్రవరిలో సెట్స్‌పైకి తీసుకెళ్ళాలని యూనిట్ భావిస్తోండగా చిరు 150వ సినిమాకు కొన్ని చిక్కులు వచ్చి పడ్డాయి.విజయ్ - మురుగదాస్ కాంబినేషన్లో కత్తి చిత్రం తెరకెక్కగా, ఈ చిత్రం తమిళంలో మంచి సక్సెస్‌ను సాధించింది. ఈ క్రమంలో రీమేక్‌కు సన్నాహాలు చేస్తోండగా ఎన్.నరసింహరావు అనే రచయిత నుండి ఎదురు దెబ్బ తగిలింది. సినిమా నిర్మాణం చేపట్టొద్దని, తనకు న్యాయం చేయకుండా సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళొద్దని తెలుగు కథా రచయితల సంఘం అధ్యక్షుడు దాసరి నారాయణరావుకు నరసింహరావు కైంప్లెంట్ చేసారు.ఎన్. నరసింహారావు దాసరిని కలసి తనకు న్యాయం చేయాలని కోరారు. కత్తి సినిమాను రీమేక్ చేయకుండా డబ్బింగ్ చేసుకోవాలి, లేదంటే ైస్ట్రెట్గా విడుదల చేసుకోవాలని ఎన్. నరసింహారావు సూచించినట్టు తెలుస్తోంది. కత్తి సినిమాను రీమేక్ చేయాలని భావిస్తే మాత్రం 24 క్రాఫ్ట్స్ నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుందని ఆయన స్పష్టం చేసారు. దాసరి కూడా ఈ విషయంపై స్పందించి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలిపినట్టు సమాచారం. మరి ఈ నేపధ్యంలో చిరు సినిమా సమస్యను కూల్‌గా సాల్వ్ చేసుకొని గట్టెక్కుతుందో లేదో చూడాలి
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







