యూఏఈ : జాత్యాహంకార ప్రసంగం చేసిన మీడియా వ్యక్తికి రిమాండ్
- April 16, 2020
యూఏఈ:ఓ వర్గాన్ని కించపరుస్తూ జాత్యాహంకార ప్రసంగం చేసిన వ్యక్తికి రిమాండ్ కు తరలించారు. యూఏఈకి చెందిన ఓ మీడియాలో పని చేస్తున్న టీఎం అనే వ్యక్తి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన వీడియోపై ఫిర్యాదులు రావటంతో యూఏఈ ఫెడరల్ కోర్టు విచారణ చేపట్టింది. నిందితుడు తన ప్రసంగంలో జాత్యాహంకారం ప్రస్పుటించటమే కాకుండా ఓ వర్గాన్ని కించపరిచేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది యూఏఈ ప్రధామిక సూత్రమైన సమానత్వ భావనకు విరుద్ధంగా ఉందని కోర్టు అభిప్రాపడింది. నిందితుడిపై ఉన్న ఆరోపణలకు సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతోంది..న్యాయపరమైన చర్యలను పరిశీలిస్తున్నామని ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికార ప్రతినిధి తెలిపారు. సోషల్ మీడియా వేదికగ గానీ, మరే ఇతర మాధ్యమంలోనైనా సరే జాత్యాహంకార వ్యాఖ్యలు చేసి వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







