కరోనా: ప్రైవేట్ సెక్టార్ కోసం అదనపు ప్యాకేజీకి కింగ్ ఆమోదం
- April 16, 2020
రియాద్: సౌదీ అరేబియా కింగ్ సల్మాన్, ప్రైవేట్ సెక్టార్‌ని కరోనా క్రైసిస్ నేపథ్యంలో ఆదుకునేందుకు అదనపు ఎకనమిక్ ప్యాకేజీకి ఆమోదం తెలిపారు. మొత్తం 50 బిలియన్ రియాల్స్ ప్యాకేజీలో అనేక కీలక అంశాలున్నాయి. ప్రైవేట్ సెక్టార్ డ్యూస్ చెల్లింపుని సులభతరం చేస్తుంది. ఆయా రంగాల్లో లిక్విడీటీని పెంచుతుంది. ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్నవారి వేతనాల చెల్లింపుకు ఉపకరిస్తుంది. 47 బిలియన్ రియాల్స్‌ని హెల్త్ సెక్టార్ కోసం కేటాయిస్తున్నారు. 30 మిలియన్ జనాభా వున్న దేశంలో కొత్తగా 493 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 5,862 కరోనా పాజిటివ్ కేసులు దేశంలో నమోదుకాగా, 79 మరణాలు సంభవించాయి. కాగా, ఇటీవలే కింగ్ సల్మాన్, 9 బిలియన్ రియాల్స్‌ని ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగుల జీతాల కోసం విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







