స్కామ్ ఈ-మెయిల్స్‌పై యాంటీ సైబర్ క్రైమ్ హెచ్చరిక
- April 16, 2020
మనామా:జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ, స్కామ్ ఈ-మెయిల్స్ పట్ల హెచ్చరికలు జారీ చేసింది. యాపిల్ కంపెనీ నుంచి వచ్చినట్లుగా చెబుతున్న ఇ-మెయిల్ ద్వారా ఐడీ వెరిపికేషన్ అడుగుతున్నారనీ, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు. వినియోగదారుల్ని మోసం చేసేందుకు ఇలా ఇ-మెయిల్ స్కామర్స్ ప్రయత్నిస్తున్నారనీ, వ్యక్తిగత వివరాలు పొందుపర్చితే, బ్యాంక్ అక్కౌంట్లలో సొమ్ము మాయమవుతుందని అధికారులు హెచ్చరించారు. ఈ తరహా ఫేక్ ఇ-మెయల్స్ పట్ల అప్రమత్తంగా వుండాలనీ, ఇ-మెయిల్ ఐడీలను పూర్తిస్థాయిలో పరిశీలించి, సంబంధిత సంస్థతో చర్చించాలని డిపార్ట్మెంట్ సూచిస్తంది. ఏ సంస్థ కూడా వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కోరదని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్‌లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







