ఇండియన్ నేవీలో 21 కరోనా పాజిటివ్ కేసులు
- April 18, 2020
భారత్ ను కరోనా భయపెడుతోంది. ఎంతో మంది వైరస్ బారిన పడుతున్నారు. వేలాది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.భారత నావికాదళంలో కేసులు నమోదయ్యిందనే వార్త సంచలనం రేకేత్తోంది. నేవీ ముంబైలో పనిచేస్తున్న 21 మంది నావికులకు
కరోనా వైరస్ సోకింది.
వీరందరినీ క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి కుటుంబసభ్యులను కూడా తరలించినట్లు సమాచారం. వీరు ఎవరెవరితో మాట్లాడారు ? ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న INS ఆంగ్రేలో బస చేసిన వారికి కరోనా సోకడంతో..దీనిని లాక్ డౌన్ చేశారు. విభిన్న శ్రేణి, సౌకర్యాల పనితీరును పర్యవేక్షిస్తుంది. ముంబై నేవీ ఆసుపత్రి INHS అశ్వినిలో క్వారంటైన్ చేసినట్లు సమాచారం. ముంబైలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. చివరకు అదే ముంబైలోని నావికాదళంలో కరోనా కలకలం రేపుతోంది.
భారతదేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్‌తోపాటు పలు రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో భారత్ కోవిడ్ బాధితుల సంఖ్య 13వేల 835కు చేరింది. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 1076 కేసులు నమోదు అయ్యాయి. దేశంలో మరోసారి ఒకేరోజు వెయ్యికి మించి కరోనా కేసులు నమోదయ్యాయి.
దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఒకవైపు లాక్‌డౌన్ కొనసాగుతున్నా.. మరోవైపు కేసులు అంతకంతకూ పెరుగుతుండడం ప్రభుత్వాన్ని కలవరానికి గురిచేస్తోంది. రాష్ట్రాల పరంగా చూసినప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్‌లో ఇప్పటి వరకు వెయ్యి కేసులు దాటాయి. గుజరాత్‌లో శుక్రవారం నాటికి కరోనా కేసుల సంఖ్య 1021 కు చేరింది. 38 మంది చనిపోయారు.
కరోనా కేసుల నమోదులో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉన్నట్టు కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 3, 320 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 201 మందిని కరోనా బలితీసుకుంది. ముంబైలోని అతిపెద్ద మురికివాడ అయిన ధారావిలో కరోనా కోరాలు చాస్తోంది. ఇక్కడ శుక్రవారం కొత్తగా 15 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 100కి దాటింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







