కువైట్:అల్-మహబౌలాలోని కార్మికులకు ఫుడ్ బాస్కెట్ల పంపిణీ
- April 18, 2020
కువైట్:లాక్ డౌన్ కష్టాలు ఎదుర్కొంటున్న కార్మికులకు కువైట్ రెడ్ క్రెసెంట్ సొసైటీ బాసటగా నిలుస్తోంది. అల్ మహబౌలాలోని కార్మికులకు దాదాపు పదిహేను వందల ఫుడ్ బాస్కెట్లను పంపిణీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కువైట్ లో కొన్నాళ్లుగా లాక్ డౌన్ నిబంధనలను అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో లాక్ డౌన్ అమలులోకి వచ్చిన నాటి నుంచి కార్మికులకు ఆహార పదార్ధాలను అందిస్తున్నట్లు కువైట్ రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడించింది. అల్ మహబౌలా, జలీబ్ అల్-షుయౌఖ్ లోని ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. అలాగే జహ్రా, తైమా ప్రాంతాల్లోని కార్మికులకు అవసరమైన నిత్యావసర సరుకుల కూడా పింపిణీ చేస్తున్నట్లు KRCS తెలిపింది.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







