కువైట్:కార్మికుల నివాసాలకు డబ్బులు ఇవ్వని కంపెనీలపై చర్యలు

- April 19, 2020 , by Maagulf
కువైట్:కార్మికుల నివాసాలకు డబ్బులు ఇవ్వని కంపెనీలపై చర్యలు

కువైట్:వివిధ కంపెనీల్లో పని చేసే ప్రవాస కార్మికులకు నివాస సౌకర్యం కల్పించే బాధ్యత ముమ్మాటికి ఆయా సంస్థలదేనని కువైట్ కార్మిక శాఖ మంత్రి మరియం అల్ అకీల్ మరోసారి స్పష్టం చేశారు. కార్మికుల నివాసం కల్పించటం కోసం డబ్బులు ఇవ్వకున్నా..వారిని స్వంత దేశాలకు తరలించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా చట్టపరమైన చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. కార్మిక చట్టాలను ఉల్లంఘించిన కాంట్రాక్టర్లు, సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదవుతాయని అని కూడా స్పష్టం చేశారు. ఒకవేళ చట్టాలను ఉల్లంఘించినట్లు నిరూపించబడితే న్యాయపరంగా గరిష్ట శిక్షలకు అర్హులు అవుతారని మరియం అల్ అకీల్ అన్నారు. ప్రస్తుత విపత్కర సమయంలో దేశ పౌరులు, ప్రవాసీయులు అన్యాయాలపై పోరాడేందుకు కలిసి ఉండాలని ఆమె సూచించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com