మస్కట్: పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా సోకిందన్న పుకార్లను ఖండించిన ప్రభుత్వం
- April 19, 2020
మస్కట్:సుల్తానేట్ పరిధిలో ఓ పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా వైరస్ సోకిందన్న ప్రచారాన్ని అధికారులు కొట్టిపారేశారు. అలాంటి ఘటనలు ఏమి చోటు చేసుకోలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పిజ్జా డెలివరీ బాయ్ వైరస్ సోకటంతో అతను డోర్ డెలివరీ చేసిన 72 కుటుంబాలను నిర్బంధంలోకి తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం కాస్త ప్రభుత్వ అధికారుల వరకు చేరటంతో..ప్రజల్లో నెలకొన్న అపోహలపై స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. సుల్తానేట్ పరిధిలోని పిజ్జా డెలివరీ బాయ్ కి వైరస్ ఉన్న కేసులేవి తమ దృష్టికి రాలేదని, ఇది ఇతర దేశాల్లో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన వార్త అని కూడా స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







